ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని తిరుమలలో శివన్ ప్రత్యేక పూజలు!

  • రేపు ఉదయం జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 ప్రయోగం
  • శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న శివన్
  • వాతావరణం అనుకూలిస్తేనే శాటిలైట్ పంపుతామన్న శివన్
రేపు ఉదయం 5.08 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్ 3డీ2 శాటిలైట్ ప్రయోగం ఉండగా, ఇది విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ కే శివన్, ఈ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపించారు. శివన్ కు స్వాగతం పలికిన అధికారులు, దర్శనానంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.

అనంతరం శివన్ మాట్లాడుతూ, ఈ శాటిలైట్ సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకు రానుందని అన్నారు. ఈ శాటిలైట్ తో జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు ఎంతో ఉపయోగం ఉంటుందని చెప్పారు. వాతావరణం అనుకూలంగా ఉంటేనే శాటిలైట్ ప్రయోగం చేపడతామని, లేకుంటే వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
Go Back to Shorts
ISRO
Satilite
Tirumala
Sivan

More Telugu News